మెగా ఫ్యామిలీకి ఈ న్యూమరాలజీ  పిచ్చి చాలా ఉందని చెప్పవచ్చు. చాలా చాలా మంది పేర్ల విషయం లో నమ్మకాలను పాటిస్తారు. కొంత మంది తమ పేర్లను ఉచ్చారణ మారేటట్లు మార్చడం లేదా పేర్ల లెంగ్త్ ను తగ్గించడం లేదా పెంచడం చేస్తుంటారు. ఇప్పడూ ఇదే నమ్మకాన్ని చిరు ఫామిలీ ఫాలో అవుతుంది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా విజేత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

Image result for chiranjeevi alludu

పోస్టర్ చూస్తే అల్లుడు సక్సెస్ ఫుల్ కెరీర్ కోసం చిరంజీవి న్యూమరాలజీని ఫాలో అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. చిరంజీవి చిన్నల్లుడు పేరు కల్యాణ్, పూర్తి పేరు కల్యాణ్ దేవ్. ఇంగ్లిష్ లో kalyan dev అని రాయాలి. అంటే ఈ పేరులో 9అక్షరాలుంటాయి. న్యూమరాలజీ ప్రకారం 9 అక్షరాల పేరు కూడా చాలామందికి కలిసొస్తుంది. అయితే అల్లుడి జాతకం ప్రకారం ఆయనకు 11అక్షరాల పేరయితే బాగా కలిసొస్తుందని చిరంజీవికి ఓ జ్యోతిష్కుడు సూచించాడు. దీంతో అల్లుడి పేరుని 11అక్షరాల kalyaan dhev గా మార్చారు చిరంజీవి.


Image result for chiranjeevi alludu

తొలి సినిమా విజేత ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ 11అక్షరాల పేరుని ప్రజెంట్ చేశారు. శ్రీజ వెడ్డింగ్ కార్డ్ చూస్తే అందులో kalyan అని మాత్రమే ఉంటుంది. అయితే సినిమా విషయానికి వచ్చే సరికి న్యూమరాలజీ ప్రకారం kalyaan dhev గా మారిపోయాడు చిరు చిన్నల్లుడు. కొడుకు రామ్ చరణ్ విషయంలో కూడా గతంలో ఇలాగే చేశారు చిరంజీవి. 11అక్షరాల ram charan tej పేరుని 9 అక్షరాల ram charan గా మార్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: