అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా మొదటి ప్రయత్నం అఖిల్ ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన హలో కూడా అంతగా ఆకట్టుకున్నది లేదు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా అఖిల్ కు మంచి విజయాన్ని అందించలేకపోయింది.


ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఎక్కువ కన్ ఫ్యూజ్ అవకుండా తొలిప్రేమ డైరక్టర్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా ఒప్పుకున్నాడు అఖిల్. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా మిస్టర్ మజ్ఞు అని పెట్టబోతున్నారట. ఆల్రెడీ నాగార్జున మజ్ను చేసేశాడు. నాచురల్ స్టార్ నాని మజ్ను పేరుతో మంచి హిట్టే అందుకున్నాడు.


ఇక ఇప్పుడు అఖిల్ కూడా మిస్టర్ మజ్ను అంటూ రాబోతున్నాడట. ఈ సినిమాకు ఈ టైటిల్ కాకుండా మరే టైటిల్ పెట్టే అవకాశం లేదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మిస్టర్ వరుణ్ తేజ్ సినిమా.. మజ్ఞు నాని చేశాడు. ఈ రెండిటిని కలిపి మిస్టర్ మజ్ను అని పెట్టడం అంత ఇంప్రెసివ్ గా అనిపించడం లేదనది టాక్. 


కథకు తగినట్టు టైటిల్ పెట్టాలన్న ఆలోచనతో డైరక్టర్ వెంకీ అట్లూరి ఈ టైటిల్ ప్రిఫర్ చేశాడట. కథకు తగినట్టు అయితే ఓకే కాని మిస్టర్ మజ్ను మాత్రం అంత బజ్ క్రియేట్ చేసే టైటిల్ అయితే కాదు. ఇక తొలిప్రేమ సినిమాలానే ఈ సినిమా కూడా ఎక్కువ ఫారిన్ లొకేషన్స్ లోనే షూటింగ్ ఉంటుందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: