సూపర్ స్టార్ మహేష్ రీసెంట్ గా భరత్ అనే నేను సినిమాతో బాక్సాఫీస్ పై మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ప్రస్తుతం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లి సినిమా మొదలు పెట్టబోతున్నారు. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.


ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే సినిమా టైటిల్ ఇదే అంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. కొన్నాళ్లుగా ఫ్యామిలీ, ఎమోషన్స్ అంటూ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ ఈసారి రఫ్ లుక్ లో ఫ్యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమాకు టైటిల్ గా రాజసం అని పెట్టబోతున్నారట. 


ఇలా టైటిల్ బయటకు వచ్చిందో లేదో అలా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ చేశారు ఫ్యాన్స్. స్టార్ సినిమాల టైటిల్స్ ప్రకారం అభిమానులు వారి క్రియేటివిటీని బట్టి పొస్టర్స్ డిజైన్ చేస్తారు. రాజసం టైటిల్ కు మహేష్ పర్ఫెక్ట్ అంటున్నారు. అయితే ఎలా చేశారో ఏమో కాని మీసపు కట్టు, గెడ్డం లుక్ తో మహేష్ రాజసం ఫస్ట్ లుక్ నిజంగానే సూపర్ గా ఉంది.


ఇలానే సినిమాలో ఉన్నా ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవని చెప్పొచ్చు. భరత్ అనే నేనుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ 25వ సినిమా చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో మహేష్ మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఆ సినిమా థ్రిల్లర్ కథతో వస్తుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: