Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 26, 2019 | Last Updated 8:38 am IST

Menu &Sections

Search

‘ఆఫీసర్’కి సెన్సార్ రిపోర్ట్!

‘ఆఫీసర్’కి సెన్సార్ రిపోర్ట్!
‘ఆఫీసర్’కి సెన్సార్ రిపోర్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన 'ఆఫీసర్' .. కొంతసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్’‌ని కర్ణాటకకు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా రూపొందించారు వర్మ. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు నాగార్జున.  సాధారణంగా రాంగోపాల్ వర్మ చిత్రాలకు సెన్సార్ విషయంలో ఏదో ఒక రగడ జరగడం ఆనవాయితీ..కానీ నాగార్జున నటిస్తున్న ‘ఆఫీసర్’ చిత్రం మాత్రం సెంటిమెంట్ బాగా వర్క్ ఔట్ అయ్యిందట.
nagarjuna-ram-gopal-varama-officer-movie-censor-re
సుమారు 28 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ చిత్రం టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఈమూవీలో స్టూడెంట్ లీడర్.. సైకిల్ చైన్ లాగే సీన్ ఓ సంచలనం. ఆ మూవీ తరువాత అంతం, గోవింద గోవింద చిత్రాలు వచ్చాయి. లాంగ్ గ్యాప్ తరువాత నాగార్జున హీరోగా వర్మ కంపెనీ నుండి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ మద్య బాలీవుడ్ లో తన సత్తా చాటాలని వెళ్లిన వర్మ రెండుమూడు చిత్రాలు పరవాలేదు అనిపించుకున్నా..తర్వాత వచ్చిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 

nagarjuna-ram-gopal-varama-officer-movie-censor-re
దాంతో మళ్లీ టాలీవుడ్ లోనే సినిమాలు తీశారు.  బ్యాడ్ లక్ ఏంటంటే..ఇక్కడ కూడా మనోడు పెద్దగా సక్సెస్ కాలేక పోయారు. కాకపోతే ఈ మద్య సినిమాల కన్నా కాంట్రవర్సీ కామెంట్స్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. కర్ణాటకకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగిందని చెప్పడం వలన అందరిలో ఆత్రుత పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందని భావిస్తున్నారు. 
nagarjuna-ram-gopal-varama-officer-movie-censor-re
చాలా గ్యాప్ తరువాత నాగార్జున హీరోగా వర్మ కంపెనీ నుండి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే వరుస ఫ్లాప్‌లలో ఉన్న వర్మ ‘ఆఫీసర్’ చిత్రాన్ని చాలా శ్రద్దగా, జాగ్రత్తగా తెరకెక్కించానంటున్నారు. ఇక నాగార్జున కూడా ఈమూవీపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.  


nagarjuna-ram-gopal-varama-officer-movie-censor-re
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీనా..మజాకా!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  క్లీన్ U సర్టిఫికెట్ !
అక్కడ నవ్వులపాలైన కేఏపాల్!
ఒకే కుటుంబం..మూడు పార్టీలు!
ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల ప్రక్రియ..!
నయనతారను అవమానించినందుకు తగిన శాస్తి!
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!