అర్జున్ రెడ్డి సినిమా కేవలం విజయ్ దేవరకొండను స్టార్ ను చేయడమే కాదు ఇండస్ట్రీకి షాలిని పాండే లాంటి హీరోయిన్ ను పరిచయం చేసింది. సినిమాలో ఏమాత్రం లిప్ లాక్స్ లో ఏమాత్రం సిగ్గు పడకుండా చేసి తెలుగు ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది షాలిని పాండే. ఇక ఆ తర్వాత ఆమెతో వరుస సినిమాలు చేస్తున్నారు.


ఈమధ్యనే వచ్చిన మహానటి సినిమాలో కూడా షాల్ని పాండే నటించింది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా షాల్ని పాండే వరుస అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన 100% లవ్ సినిమా రీమేక్ లో జివి ప్రకాశ్ తో షాలిని రొమాన్స్ చేస్తుంది. జీవాతో గొరిల్లా సినిమాలో కూడా నటిస్తుంది షాలిని.


ఇంట్లో వారికి ఇష్టం లేకున్నా సరే ఇండస్ట్రీకి వచ్చానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన షాలిని పర్సనల్ లైఫ్ లో రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని చెప్పింది. అందుకే అర్జున్ రెడ్డి సినిమా చాలా నచ్చిందని అయితే విజయ్ తో లిప్ లాక్ సీన్స్ చేసేప్పుడు మాత్రం నరకం అనుభవించానని అన్నాది షాలిని.


సినిమా యూత్ ఎట్రాక్ట్ అయ్యేలా లిప్ లాకులు అదరగొట్టారు. విజయ్, షాలిని పాండే ఇద్దరు ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయార్య్. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బంది పడ్డానని చెప్పిన షాలిని సినిమా కాబట్టి తప్పలేదని చెప్పింది. ఇక ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తోనే అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: