బాలీవుడ్, క్రికెట్ ఈ రెండు రంగాలు వేరైనా ఈ రెండింటికి ఎక్కడో ఏదో దగ్గరి అనుభందం ఉన్నట్లుంటుంది. క్రికెటర్లు, హీరోయిన్లు ఒకరికొకరు ఒకరిపై మనసు పారేసుకుని చెట్టాపట్టాలేసుకొని తిరిగి పీటల మీదికెక్కిన సందర్భాలు అనేకం. తాజాగా కొత్తగా పెళ్లైన జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లే ఇందుకు చక్కటి ఉదాహరణ.


తాజాగా ఈ లిస్ట్ లోకి ఇంకో జంట చేరిపోతున్నదా అని అనిపిస్తుంది. ఎందుకంటే టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు బాలీవుడ్ నిధి అగర్వాల్ ముంబై వీధుల్లో చెట్టపట్టాలేసుకొని తిరగడం పలు ఊహాగానాలకు తావునిస్తుంది. ఇక నిధి అగర్వాల్ ఎవరో కాదు తాజాగా నాగ చైతన్య నటిస్తున్న సవ్యసాచి సినిమా హీరోయిన్ కావడం విశేషం.


వీరిద్దరూ ముంబైలోని బాంద్రాలో జంటగా కనిపించగా అభిమానులు కెమెరాలకు పని చెప్పారు. ఇంకేముంది నిమిషం అయ్యేలోపు వీరిద్దరి ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్ చల్ చేశాయి. అంతేగాక గతంలో కూడా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడిలా ఇద్దరు కలిసి బయట చక్కర్లు కొట్టడం ఆ వార్తలకు బలం చేకూర్చాయి. అయితే వీరిపై  వస్తున్న రూమర్లకు వీరు ఎటువంటి కామెంట్లు చేయకపోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: