ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మహేష్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఇప్పటికి స్టార్ గా ఎదిగేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా సమ్మోహనం. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.


ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి నటించడం జరిగింది. ట్రైలర్ లో చెప్పిన కథ ప్రకారం హీరోయిన్స్ గ్లామర్ అంటే ఇష్టం లేని హీరో డైరెక్ట్ గా హీరోయిన్ నే ప్రేమిస్తాడు.


ఆమె వల్ల పొందిన ప్రేమానుభూతులే ఈ సమ్మోహనం కథ. ట్రైలర్ లో కథ దాదాపుగా చెప్పేసిన దర్శకుడు మోహనకృష్ణ స్క్రీన్ ప్లేతో సినిమా నడిపిస్తాడని అనిపిస్తుంది. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా బాగానే రాసుకున్నట్టు ఉన్నాడు. పక్కన కమెడియన్స్ తో హీరో డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి.


వివేక్ సాగర్ మ్యూజిక్ అదనపు ఎట్రాక్షన్ అయ్యేట్టు ఉంది. త్వరలో రిలీజ్ అవనున్న ఈ సినిమా ప్రేక్షకులను సమ్మోహన పరుస్తుందో లేదో చూడాలి. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా ఈరోజు సమ్మోహనం ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: