బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్నారు అమీర్ ఖాన్.  తాను ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక స్పెషల్ చేయాలని తాపత్రయపడే హీరోల్లో అమీర్ ఖాన్ ఒకరు.  అందుకే ఆయన నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడమే కాదు కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు నెలకొల్పుతాయి.  ఆ మద్య లగాన్ ఈ మద్య దంగల్ ఏ సినిమా అయినా ఆ పాత్రల్లో లీనమైపోతాడు. అయితే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ఏ విషయంలోనూ కాంట్రవర్సీలు సృష్టించరు..అసలు కాంట్రవర్సీల జోలికే వెళ్లరని టాక్.
Image result for amir khan
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆమిర్‌ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమిర్‌ఖాన్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తన కుమార్తెతో కలసివున్న ఫొటోను షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అసభ్యకరంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఓ పార్క్ లో తన ముద్దుల కూతురు ఇరాఖాన్‌తో స్పోర్ట్స్ మూడ్‌లో ఉన్న ఒక ఫొటో షేర్ చేశారు. ఈ ఫోటో పై ఇప్పుడు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
Image result for amir khan daughter
ఒక ముస్లిం సోదరుడు కామెంట్ చేస్తూ ‘పవిత్ర రంజాన్ మాసంలో ఆమిర్ ఇటువంటి ఫొటో షేర్ చేయకుండా ఉండాల్సింది’ అని పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆమిర్ సార్... ఒకసారి రంజాన్ గుర్తుకు తెచ్చుకోండి. ఆమె మీ కుమార్తె.. రంజాన్ సందర్భంలోనైనా మంచి దుస్తులు ధరించాలి’ అని సూచించాడు. ఇదిలా ఉంటే మరో నెటిజన్ ‘ఇది తండ్రీ కుమార్తెల ప్రేమకు చిహ్నం.
Image result for amir khan daughter park photo viral
ఇది కూడా జనాలకు సమస్యగా మారింది. ఒక తండ్రి ఎదుగుతున్న తన పిల్లలతో ఆడుకోకూడడా? ఈ ఫొటోలో కుమార్తెకు బదులు కొడుకు ఉంటే ఇలా అనేవారా? రంజాన్ మాసంలో తండ్రి తన పిల్లలను ప్రేమించకూడదనే నిషేధం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఏది ఏమైనా సెలబ్రెటీలు ఏది చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: