శివ, గోవిందా గోవిందా తర్వాత పాతికేళ్ల గ్యాప్ తో వర్మతో కలిసి ఆఫీసర్ సినిమా చేశాడు వర్మ. ఆర్జివి స్టైల్ ఈఫ్ టేకింగ్ కు ఫిదా అయిన నాగ్ ఈమధ్యనే తను చెప్పిన క్రేజీ స్టోరీ విని అఖిల్ తో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాని ఏమైందో ఏమో కాని మళ్లీ అఖిల్, వర్మల సినిమాకు నాగార్జుననే అడ్డు పడుతున్నాడట.


ఆఫీసర్ ఇంటర్వ్యూలో వర్మతో అఖిల్ సినిమాపై క్లియర్ కట్ గా చెప్పేశాడు నాగార్జున. నేనైతే అఫిషియల్ గా చెప్పలేదు ట్వీట్ చేయలేదు. వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయేమో అంటూ నాగ్ మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే నాగార్జునకు వర్మతో అఖిల్ సినిమా చేయడం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది.


ఆల్రెడీ ఆఫీసర్ సినిమానే నాగ్ ఎందుకు చేస్తున్నాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు అఖిల్ కెరియర్ ను వర్మ చేతిలో పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అనుకుంటా అందుకే ఆర్జివి, అఖిల్ సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు నాగార్జున. పై ఎస్ ఆర్ నో అని చెప్పకున్న లోపల చేయాల్సింది చేస్తున్నాడని తెలుస్తుంది.


ఎందుకు అంటే నాగార్జునకు చెప్పకుండా ఇష్టం లేకుండా అఖిల్ తనంతట తానే సినిమా నిర్ణయాలు తీసుకునే స్థాయికి రాలేదు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్న అఖిల్ తన 4వ సినిమాపై మాత్రం ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఇదవరకు సినిమాల కన్నా ఈ సినిమా మాత్రం త్వరగానే వెళ్లడించే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: