స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రైటర్ వక్కతం వంశీ దర్శకుడిగా చేసినా మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో బన్ని యాంగ్రీ సోల్జర్ గా కనిపించి అభిమానులను అలరించాడు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మే 4న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.


అంచనాలను అందుకోవడంలో విఫలమైన నా పేరు సూర్య మొదటి షో నుండి డివైడ్ టాక్ తో రన్ అవుతూ చివరకు ఫ్లాప్ మూవీగా మిగిలింది. ఇక 77 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాసులే తెచ్చి పెట్టిందట. నా పేరు సూర్య అంటూ బన్ని వేసిన స్టైలిష్ మంత్రం పనిచేయలేదని చెప్పాలి.


సినిమా కథ పరంగా బాగానే ఉన్నా డైరక్టర్ కొత్తవాడు కావడం వల్ల ఆడియెన్స్ మెప్పు పొందేలా సినిమాను తెరకెక్కించలేదు. ఇక సినిమా అసలు వసూళ్ల లెక్క చూస్తే ఓవరాల్ గా ఇప్పటివరకు ఈ సినిమా 50.14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారిగా సినిమా కలక్షన్స్ చూస్తే..


నైజాం :12.60 కోట్లు, సీడెడ్ : 6.80 కోట్లు, ఉత్తరాంధ్ర : 5.30 కోట్లు, గుంటూర్ : 3.90 కోట్లు, ఈస్ట్ : 3.70 కోట్లు, వెస్ట్ : 2.85 కోట్లు, కృష్ణా : 2.65 కోట్లు, నెల్లూరు : 1.64 కోట్లు, ఏపి/టిఎస్ టోటల్ కలక్షన్స్ : 39.44 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా :  6.60 కోట్లు, ఓవర్సెస్ : 4.10 కోట్లు, వరల్డ్ వైడ్ కలక్షన్స్ : 50.14 కోట్లు.  



మరింత సమాచారం తెలుసుకోండి: