2007 లో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కించిన హారర్ సినిమా ముని ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న రీమేక్ లే అందుకు నిదర్శనాలు. అయితే ముని వంటి హారర్ సినిమాలో కూడా తన అందంతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది ఆ సినిమా హీరోయిన్ వేదిక. 


ముని తరువాత తెలుగులో ఇంకో మూడు సినిమాలు చేసినా తనకి ఫేమ్ ను తీసుకరాలేకపోవడంతో తిరిగి తమిళ, మలయాళ సినిమాలే చేస్తూ ఉంది. అయితే ఇటీవల ఈ అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది. 'ది బాడీ' అనే హిందీ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి ఈమెను సంప్రదించారట. నిజానికి ఈ సినిమాను స్పెయిన్ సినిమా ది బాడీ కి రీమేక్ గా నిర్మిస్తున్నారంట.


ఇమ్రాన్ హస్మి సరసన హీరోయిన్ గా నటించబోతుందట. ఇక ఈ సినిమాకు మలయాళ దర్శకుడు జీతో జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఈయన వల్లే  వేదికకు ఈ ఛాన్స్ దక్కిందన్న వార్తలూ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో వేదిక అందాలను ఆరబోస్తున్నదని సమాచారం. ముద్దు సీన్లతో పాటు ఘాటు సన్నివేశాలకు కూడా ఓకే అనేసిందట ఈ ముద్దుగుమ్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: