తెలుగు సీనియర్ హీరోస్ చాలా మంది ఉన్నారు. ముఖ్యముగా బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వీరికి వయసు ఎక్కువగా ఉండటం వల్ల వారికీ తగ్గట్టు హీరోయిన్స్ దొరకడం లేదు. వారి కంటే తక్కువ వయసు ఉన్న హీరోయిన్స్ తో నటించాల్సి వస్తుంది. దానితో  నయనతార కు డిమాండ్ పెరుగుతుంది. నయనతార తెలుగు సీనియర్ హీరోస్  అందరికి బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. 

Image result for nayanatara

ఈమె తెలుగులో సినిమా కెరీర్‌ని ఇప్పటికీ నెట్టుకొస్తోందంటే దాని వెనుక ఈ హీరోల హస్తం ఎంత ఉందో ఇట్టే అర్థమౌతుంది. నయన చివరిగా తెలుగులో వెంకీతో బాబు బంగారం చిత్రంలో నటించింది. తాజాగా చిరంజీవి నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి సినిమాలో ఈమె కథానాయికగా చేస్తోంది, బాలయ్య బాబుతో బోయపాటి చేయనున్న చిత్రంలో కూడా నటించనుందని సమాచారం.

Image result for nayanatara

ఇప్పటికే మాయ, డోరా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన నయనతార భవిష్యత్తులో కూడా అలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనంటోంది. ఇప్పటికైతే పెద్ద హీరోల పుణ్యమా అని ఎలాగోలా ఆమె కెరీర్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందన్నమాట. నిజముగా వయసు అయిపోతున్న నయనతార కు అవకాశాలు రావడం అదృష్టం అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: