సినీనటుడు మంచు మనోజ్‌ ఓ పబ్బులో అర్ధరాత్రి వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దానియొక్క  నిర్వాహకులతో మంచు మనోజ్ గొడవకు దిగాడని, ఈ నేపథ్యంలో కొద్దిపాటు ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసుకున్నారు.


వివరాల్లోకి వెళితే గత నెల మే 22న  జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్‌ పీజియన్‌ పబ్‌కు  సినీ హీరో మంచు మనోజ్‌ వెళ్లారు. అయితే రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్‌ నిర్వాహకులు డీజే సౌండ్‌ ను తగ్గించారు. దీంతో పబ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు మనోజ్‌ డీజే సౌండ్‌ పెంచాలంటూ డీజేను, స్పీకర్లు పగులగొట్టారు. 


దీనితోపబ్ లో జరగుతున్న ఘర్షణపై సమాచారం అందుకున్న  జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకోగా, తాను ఫేస్‌బుక్‌ లైవ్‌ ఆన్‌ చేయగా పబ్‌లో డీజే సౌండ్ ఎక్కువగా ఉందని, అందువల్ల సౌండ్ ను తగ్గించాలని యాజమాన్యానికి సూచించినట్లుగా మంచు మనోజ్‌ పోలీసులకు వివరించారు. అసలు అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ మనోజ్ పై పిర్యాదు చేయకపోవడంతో జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: