శివ కాంబినేషన్ లో పాతికేళ్ల తర్వాత సినిమా అనగానే అందరు ఆఫీసర్ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా చూసి అందరు షాక్ అవుతున్నారు. నాగార్జున కెరియర్ లో ఈ సినిమా డిజాస్టర్ లో కొత్త రికార్డ్ సృష్టించింది. నాగార్జున ఏం చూసి ఈ సినిమా తీశాడని అందరు కామెంట్లు చేస్తున్నారు.


టీజర్, ట్రైలర్ చూసే ఈ సినిమా మీద నమ్మకం కలగలేదు. అందుకే సినిమా రిలీజ్ వరకు డిస్ట్రిబ్యూటర్స్ రాలేదట. ఈలోగా అఖిల్ తో వర్మ సినిమా అని అన్నారు. టెస్ట్ షూట్ కూడా జరిగిందని హడావిడి చేశారు. ఆఫీసర్ అవుట్ పుట్ బాగుండబట్టి అఖిల్ తో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.


అయితే ఇదంతా కేవలం ఆఫీసర్ సినిమా అమ్ముకోడానికి వేసిన ప్లాన్ అని తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరికి ఆఫీసర్ బాగుంది సినిమా కొనేయొచ్చని చెప్పారట. ఒకవేళ నమ్మకం లేకున్నా వర్మతో అఖిల్ సినిమా ఉందన్న షో ఇచ్చి ఆ సినిమా హక్కులు కూడా వారికే అన్నట్టుగా ఆఫీసర్ డిస్ట్రిబ్యూటర్స్ ను మోసం చేశారట.   


అలా మొత్తానికి ఎలాగోలా వర్మ ఆఫీసర్ రిలీజ్ చేశాడు. ఇక రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఈ సినిమా అమ్ముకోడానికి అఖిల్ వర్మ సినిమా అంటూ హడావిడి చేశారని తేలింది. ఈ విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ ఉందో లేదో తెలియదు కాని మొత్తానికి మ్యాటర్ ఈ న్యూస్ అందరికి షాక్ ఇచ్చింది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: