రీసెంట్ గా క్రిష్ తన భార్య రమ్యతో విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇద్దరు ఇప్పటికే డైవర్స్ కు అప్లై చేశారని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు క్రిష్ తన భార్యతో విడిపోవడం పెద్ద షాకే అని చెప్పొచ్చు. రమ్య డాక్టర్ అవడంతో వృత్తిపరమైన విభేధాల వల్ల వారిద్దరు విడిపోతున్నారని తెలుస్తుంది.


ఇక ఇదిలా ఉంటే మరో సినిమా జంట విడిపోయేందుకు సిద్ధమైందట. అతనో యాక్షన్ హీరో ఆయన తండ్రి పెద్ద హీరో.. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తనయులిద్దరిని హీరోలుగా పరిచయం చేశాడు. సూపర్ హిట్లు పడకున్నా సరే కెరియర్ ఏదోలా సాగుతుంది. ఇక ఈ ఇద్దరి హీరోల్లో ఒక హీరో తన భార్యకు విడిపోవాలని నిర్ణయించుకున్నాడట.


రెండేళ్ల క్రితం పెళ్లైన ఈ జంట కలివిడిగా ఉండటం లేదట. ఆ హీరో కెరియర్ కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడట. దానికి తోడు భార్య భర్తల మధ్య గొడవలని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటుందట. వీరిద్దరు విడిగా ఉండబట్టి ఏడాది కావొస్తుందట.


త్వరలోనే వీరిద్దరు డైవర్స్ తీసుకోనున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు అందుకే ఆ హీరో పేరు రివీల్ చేయడం లేదు. మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: