టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లు కావాలని వచ్చిన వారిని దళారుల దగ్గర నుంచి దర్శక, నిర్మాతలు, హీరోలు సైతం ఘోరంగా మోసం చేస్తున్నారని..పడక సుఖం అందిస్తేనే ఛాన్స్ లు ఇస్తామని వారి జీవితాలతో ఆడుకుంటున్నారని నటి శ్రీరెడ్డి ఆ మద్య పెద్ద ఉద్యమమే చేసింది.  అయితే పోరాటం మంచి ఫామ్ లోకి వచ్చే సమయంలోనే పవన్ కళ్యాన్ ని తిట్టడంతో కథ అంతా రివర్స్ అయ్యింది. 
Image result for pawan kalyan
శ్రీరెడ్డి పై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం మొదలయ్యాయి..మీడియా దూరంగా ఉంచింది..ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఘోరంగా తిట్టడం మొదలు పెట్టారు.  దాంతో వారం రోజుల పాటు ఎవరి కంటా పడని శ్రీరెడ్డి ఆ మద్య పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయిన శ్రీరెడ్డి సోషల్ మాద్యమాల ద్వారా స్పందిస్తూ..పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసుకుంది.

తాజాగా ఆంధ్రా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ కళ్యాణ్ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా, నారా లోకేష్ మీద చేస్తున్న ఆరోప‌ణ‌లపై స్పందించింది. ఆ మ‌ధ్య జ‌గ‌న్ కు అనుకూలంగా మాట్లాడిన శ్రీ‌రెడ్డి ఇప్పుడు లోకేష్ ను స‌మ‌ర్ధించింది.  "నారా లోకేష్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవారు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అని చెప్పుకోండి. అంతే గానీ విమర్శలు చేస్తే ఒప్పుకునేది లేదు.
Image result for ys jagan nara lokesh
నా నోటికి పని చెప్పొద్దు" అంటూ ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను హెచ్చరించింది. మరోపైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రపై స్పందించింది. జగన్ అన్నలా ఓర్పు మీకెక్కడ ఉంది..  జగన్ అన్న ఫ్యామిలీ లక్షల మందికి చేసిన సహాయాలు ఎవరూ మర్చిపోలేదు. సినిమా డైలాగు కొట్టి, వాటర్ తాగినంత ఈజీ కాదు. మీ అన్నయ్య రాజకీయాలు, మీ అన్న సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలీదు. మా అసోసియేషన్ లో కార్డు నాకు ఇవ్వనివ్వట్లేదు. ఇది మీ చలవే కదా అని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: