హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ ప్రస్తుతం ఇండియాలో జోరుగా సాగుతోంది. సెలెబ్రిటీలు అందరూ తాము ఇంత ఫిట్ గా ఉండటానికి రోజూ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారో ప్రజలకు తెలియజేస్తూ ఇతరులకు ఛాలెంజ్ విసురుతున్నారు. దీన్ని కేంద్ర మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ తొలుత ఈ ఛాలెంజ్ కు హ్రితిక్, విరాట్ కోహ్లీ తదితరులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. 


తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే అఖిల్, నాగర్జున, నాగ చైతన్య, రవి తేజ, ఎన్టీఆర్  తదితరులు తమకు విసిరిన ఛాలెంజులను కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి  చెర్రీ సతీమణి ఉపాసన కూడా చేరింది. సమంత విసిరిన ఛాలెంజ్ ను అంగీకరించి తాను ఫిట్ గా ఉండటానికి రోజూ ఏం చేస్తుందో మూడు రకాలయిన వ్యాయామ పద్దతులను చేసి ఆ వీడియోను నెట్లో పోస్టు చేసింది. 


అంతేగాక ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని కోరుతూ నమత్రా శిరోద్కర్‌, కనికా కపూర్‌, తరుణ్‌ తహిలియాని, పింకీ రెడ్డిలకు సవాల్ విసిరింది. కాగా ఎన్టీఆర్ ఛాలెంజ్‌ ను రామ్‌ చరణ్ కంప్లీట్ చేసి దానికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్‌ మీడియా పేజ్‌ లో పోస్ట్ చేశారు. అంతేగాక సుకుమార్‌, కేటీఆర్, అబూ జైన్‌ సందీప్‌ కోస్లా, శోభన కామినేని, వరుణ్ తేజ్‌ మరియు మెగాస్టార్‌ చిరంజీవి కి చాలెంజ్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: