సంచలనాలకు మారుపేరుగా తయారయిన శ్రీరెడ్డి తన పోరాటం నీరుగారిన తరువాత కూడా సోషల్ మీడియా వేదికగా తరచూ ఏదో ఒక పోస్టు చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే ఆ వివాదం సద్దుమణిగిన తరువాత ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసిన ఆమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలనానికి తెరలేపింది. దానికి సంబందించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.


ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంతకు ముందు ఇంటర్వ్యూల లాగా కాకుండా శృతి మించి మాట్లాడటం చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. తాను ఇండస్ట్రీలో చేస్తున్నది వర్క్ కాదని వ్యభిచారం చేస్తున్నా అంటూ తెలిపింది. ఒక డిప్యూటీ సీఎం కొడుకు తన బాయ్ ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ తరువాత బాయ్ ఫ్రెండ్ లాంటి వాడంటూ సంచలనానికి తెరలేపింది.


ఒక పార్టీలో త్రిష, రానా రాగా ఒకడికి ఏదో అయిందంటూ రాయలేని పదజాలంతో వాఖ్యలు చేసింది. ఇలా మాట్లాడినందుకు ఏమీ అనుకోవద్దు రానా బావ అంటూ చెప్పింది. అప్పటిలో రాంగోపాల్ వర్మ అలా చేయమన్నందుకే పవన్ పై అలా మాట్లాడవలసి వచ్చిందని తెలిపిన ఆమె, రేణూ దేశాయ్ పడుకుందా లేక మీ అన్న పక్కవేసాడా అంటూ ఒకరిని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తాను దగ్గుబాటి సురేష్ నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని స్పష్టం చేసింది. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే మళ్ళీ రాష్ట్రంలో వివాదాన్ని లేపే ఇంటర్వ్యూలగా అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: