నాని వ్యాఖ్యతగా ఈరోజు మొదలవనున్న బిగ్ బాస్ సీజన్-2 ఫైనల్ లిస్ట్ రివీల్ అయ్యింది. కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తున్న లిస్టులో కొందరి పేర్లే ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. లాస్ట్ సీజన్ లానే ఆడియెన్స్ కు ఏమాత్రం పరిచయం లేని కొందరు ఈ సీజన్ లో ఉండబోతున్నారని తెలుస్తుంది. 


ప్రస్తుతం సొషల్ మీడియాలో రివీల్ అయిన లిస్ట్ లో గీతా మాధురి, టివి-9 యాంకర్ దీప్తి, హీరో తనీష్, ఆర్యన్ రాజేష్, వరుణ్ సందేష్ తో పాటుగా సోషల్ యాక్టివిస్ట్ బాబు గోగినేని, సామ్రాట్, తేజశ్వి, యాంకర్ శ్యామలా వీరంతా ఫైనల్ బిగ్ బాస్ కంటెస్టంట్స్ అని తెలుస్తుంది. 


ఇక వీళ్లు కాకుండా భాను, రోల్ రిధా, కృతి దామరాజు, దీప్తి సునైనా, కౌశల్ అమిత్ తివారి, గనేష్, సంజన, నూతన్ నాయుడు వీరంతా కూడా ఈ లిస్ట్ లో ఉన్నారట. అయితే వీరెవరు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని వారు. మరి వీరితో నాని ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తడో చూడాలి.  


ఈ లిస్ట్ చూశాక బిగ్ బాస్-1 లోనే కాస్త తెలిసిన వారు ఉన్నారని అనిపిస్తుంది. మరి ఈ సీజన్ అనుకున్నంత క్లిక్ అవుతుందో లేదో చూడాలి. స్టార్ మా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ రియాలిటీ షో ఈసారి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సెట్ వేయడం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: