బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ మొదటి సీజన్ తారక్ ఉత్సాహమైన హోస్టింగ్ టాలెంట్ తో అలరించగా ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ కు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది. బిగ్ బాస్ మొదటి రోజు మొదలైంది. 16 మంది కంటెస్టంట్స్ బిగ్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


ఎవరు ఊహించని విధంగా కంటెస్టంట్స్ ను ఎంపిక చేయడం జరిగింది. అయితే మొదటి ఎపిసోడ్ నాని బాగానే మొదలుపెట్టినట్టు అనిపించినా నిన్న ఎపిసోడ్ రెండున్నర గంటలు కావడం వల్ల బుల్లితెర ఆడియెన్స్ కు కాస్త విసుగు వచ్చిందని చెప్పాలి. బిగ్ బాస్-2 మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 


నాని ఇంకాస్త తన జోష్ చూపించాలని సమయస్పూర్తి ఇంకా పెంచుకోవాలని అంటున్నారు. ఎంత స్క్రిప్ట్ సపోర్ట్ ఉన్నా అది మాత్రమే చేస్తే సరిపోదు కచ్చితంగా కొంత ఇంప్రవైజేషన్ ఉండాలి. మరి నాని ఆ విషయంలో ఇంకాస్త మెలుకువలు నేర్చుకోవాల్సి ఉంది. సినిమాల్లో చేయడం వేరు బుల్లితెర మీద హోస్ట్ చేయడం వేరు.   


రావడం రావడమే మొదటి సీజన్ కంటెస్టంట్స్ గురించి.. మొదటి సీజన్ హోస్ట్ గా చేసిన ఎన్.టి.ఆర్ గురించి మాట్లాడాడు నాని. తారక్ ఇరగ్గొట్టేశాడు అంటూనే తన పంథాలోనే నాని ఆ రేంజ్ లో చేసేయాలన్న తపనతో కనిపించాడు. మొత్తానికి నాని రానున్న ఎపిసోడ్స్ తో ఎలా కనిపిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: