తెలుగు తెరపై కొంత కాలంగా బాలనటులు హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ నంచి వచ్చిన హీరో అల్లు శిరీష్.  ‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తర్వతా వచ్చి కొత్త జంట తో మంచి హిట్ అందుకున్నాడు.  అల్లు శిరీష్ కి ఎంత బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా హీరోగా మాత్రం సక్సెస్ కాలేక పోతున్నాడు.  దీంతో కామెడీ కాన్సెప్ట్ ని మరోసారి ఎంచుకున్నాడు శిరీష్. మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన 'ఏబీసీడీ'కి ఇది రీమేక్.
Image result for MASTER BHARATH
మలయాళంలో ఈ సినిమా దుల్కర్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వసూళ్లపరంగాను చెప్పుకోదగిన స్థాయిలో నిలిచింది. అమెరికా నుంచి ట్రిప్‌ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ను లీడ్‌ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్‌ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Image result for ALLU SHIRHS
ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ బాణీలు అందిస్తారు. కృష్ణార్జున యుద్దం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్సర్‌ థిల్లార్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాతో పలు చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న బాల నుటుడు భరత్‌ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవతారం ఎత్తనున్నారు.
Image result for MASTER BHARATH
తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొట్టేసిన భరత్. 'వెంకీ' సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో మందు కలిపిన కూల్ డ్రింక్ కోసం చిత్రం శీను టీమ్ తో గొడవపడిన కుర్రాడే ఈ హీరో. పోకిరి' మూవీలో ఇలియానా తమ్ముడుగా ఆకట్టుకున్నాడు. 'రెఢీ' సినిమాలో చిట్టినాయుడు పాత్రలో కడుపుబ్బ నవ్వించాడు.  కథలో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్లనే భరత్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: