స్టార్ సినిమా అంటే ఇండస్ట్రీలో కాస్త కూస్తో క్రేజ్ ఉన్న దర్శకులని ఆ ఆడియోకి పిలవడం అలవాటే. ఇలా పిలిచే ఓ దర్శకుడు తాను చేసిన సినిమాల గురించి అది ఏ హీరో సినిమా అయినా సరే చెబుతూ ఉంటాడు. ఈవెంట్ ఒకరిదైతే అతను ప్రస్థావించేది వేరే హీరోది అవుతుంది. ఇలా ఒకటి రెండు సందర్భాలు కాదు చాలానే ఉన్నాయి.


అంతేకాదు ఒకవేళ తను ఈవెంట్ కు వచ్చిన స్టార్ హీరోతో సినిమా చేయకుంటే అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఏదో ఒక ఉదహరణ చెప్పి అతన్ని సినిమా ఛాన్స్ ఇవ్వమని సభాముఖంగానే అడుగుతాడు. ఇలా ఈమధ్య జరిగిన రెండు సినిమా వేడుకలలో ఇద్దరు స్టార్స్ ను అడిగేశాడు సదరు దర్శకుడు.


టాలెంట్ ఉన్నా సరే ఇలా సభాముఖంగా అడిగి వారిని ఇబ్బంది పెట్టడమే అంటున్నారు కొందరు. స్టార్స్ తో సినిమా తీయాలన్న తపన ఉన్నా వారు ఛాన్స్ ఇచ్చేదాకా వెయిట్ చేయాల్సి అంతేకాని ఇలా ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేకుండా అడుక్కోవడం ఏంటని మిగతా వారు అంటున్నారు.


ఆ దర్శకుడి కెరియర్ లో పవర్ ఫుల్ హిట్ ఒకటి పడ్డది ఏ వేడుక అయినా ఆ సినిమా ప్రస్థావన తెస్తాడు. ఇక ఆ తర్వాత తను చేసిన సినిమాల గురించి గొప్పగా చెబుతాడు. మరి ఆ దర్శకుడి తీరు ఇలానే కొనసాగుతుందా లేదా ఇలా చేయడం వల్ల హీరోలు ఇబ్బంది పడుతున్నరన్న విషయం గుర్తించి మారుతాడా అన్నది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: