మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న అరవింద సమేత ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా రివీల్ అయ్యింది.


దసరా బరిలో ఎన్.టి.ఆర్ బొమ్మ పడాల్సిందే.. ప్రతి దసరాకి తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న తారక్ ఈసారి దసరా బరిలో దిగుతున్నాడు. అక్టోబర్ 10న అరవింద సమేత వీర రాఘవ వస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో ఎన్.టి.ఆర్ ను చూసి చాలా రోజులయ్యింది.


ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఎన్.టి.ఆర్ మాండలికం కూడా సీమ యాసలో ఉంటుందట. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఎన్.టి.ఆర్ మరోసారి బాక్సాఫీస్ పై చెడుగుడు ఆడేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు పోటీగా స్టార్ సినిమాలు ఏవి వచ్చే అవకాశం లేదు.


ఇక చిన్న సినిమాలు అంత సాహసం చేయలేవు. కాబట్టి ఈసారి దసరా కూడా ఎన్.టి.ఆర్ కే రాసిచ్చేయొచ్చు. టెంపర్ నుండి జై లవ కుశ వరకు ఫుల్ ఫాంలో సినిమాలు చేస్తున్న తారక్ అరవింద సమేతతో రికార్డుల సంచలనాలు సృష్టిస్తాడని నందమూరి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: