నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఆల్రెడీ ఒక సీజన్ ముగిసింది కాబట్టి ఈ సీజన్ లో ఎవరు హౌజ్ లో ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు. ఇక మరో పక్క కామన్ మెన్ కు ఈసారి హౌజ్ లో అవకాశం ఇచ్చారు. ముగ్గురు కామన్ మెన్ లో సంజనా సెలబ్రిటీస్ కు గట్టి పోటీ ఇస్తుంది.


ఇక మొదటి వారం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఎన్నో గొడవలు.. మరెన్నో విషయాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే మొదటి వారం ముగిసే సరికి కెప్టెన్ గా సామ్రాట్ ఎంపికయ్యాడు. కెప్టెన్ గా పోస్ట్ బాక్స్ నుండి వచ్చిన లీటర్ ద్వారా సామ్రాట్ డైరెక్ట్ అభ్యర్ధి కాగా ఆ తర్వాత కెప్టెన్ కోసం సంజనా, గణేష్, భాను శ్రీ పోటీ పడ్డారు. 


బిగ్ బాస్-2 మొదటి కెప్టెన్ గా సామ్రాట్ బాధ్యతలు చేపట్టాడు. ఎలాగు ఈ వీక్ ఎలిమినేషన్ లిస్ట్ లో సామ్రాట్ లేడు కాబట్టి అతను సేఫ్. అయితే సామ్రాట్ ఎంపికపై తేజశ్వి, తనీష్ సంతోషంగా ఉన్నారు. బిగ్ బాస్-2 లో అప్పుడే గ్రూప్స్ ఏర్పడ్డాయి. సామ్రాట్ గ్యాంగ్ ఒకటి కాగా వారికి ఆపోజిట్ గా కౌశల్ గ్యాంగ్ రెడీ చేస్తున్నాడు.


ఈరోజు రేపు నాని సందడి చేస్తాడు. అయితే నిన్న ఎపిసోడ్ చివర్లో నాని షో కమింగ్ అప్ ఇస్తారని అనుకుంటే అది చూపించలేదు. గణేష్, కిరీటి, నూతన్ నాయుడు, కౌశల్, సంజనాలలో ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌజ్ ను విడిచి వెళ్తారో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: