ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై రక రకాల సంచలన కథనాలు వెలువడుతున్నాయి. అయితే కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఇండస్ట్రీలో నటిగా రాణించాలంటే..పడక సుఖం అందించాల్సిందే..లేదంటా వారికి కెరీర్ ఉండదని అలా మోసపోయిన వారిలో తాను ఒకరని శ్రీరెడ్డి ఆరోపిస్తుంది. కొంతమంది సెలబ్స్ ఫోటో లీక్ చేసి సంచలనం సృష్టించింది.   శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మహిళాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు లభించిన నేపథ్యంలో అనుకోకుండా పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో శ్రీరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి.  దాంతో ఆమెకు వచ్చిన మద్దతు కూడా వెనక్కి తగ్గింది. 
Image result for writer shreshta
ఇక కాస్టింగ్ కౌచ్ పై కొంత మంది హీరోయిన్లు కూడా గళమెత్తారు.   తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’ సినిమా పాటల రచయిత శ్రేష్ఠ క్యాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ నిజాలు బయటపెట్టారు.  శ్రేష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని తెలిపింది. ఏకంగా ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు ఆమెను పంపే ప్రయత్నం చేశారని తెలిపింది. అదేవిధంగా ఓ మహిళా దర్శకురాలు ఓ వ్యక్తి నిన్ను ఇష్టపడ్డాడని నీకు ప్రపోజ్‌ చేయడానికి గోవాలో పార్టీ ఏర్పాటుచేశాడని తనతో చెప్పిందని తెలిపారు.
Related image
దానికి నేను ఒప్పుకోకపోవడంతో వారు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టారని..ఇండస్ట్రీలో నువ్వు పైకి ఎలా వస్తావో మేం చూస్తామని బెదిరించినట్లు తెలిపింది.   ఇండస్ట్రీలో మగవారు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా వేధింపులకు గురిచేస్తారని తెలిసిందన్నారు. శ్రేష్ఠ ఇప్పటివరకు ‘అర్జున్‌ రెడ్డి’,‘పెళ్లి చూపులు’,‘మధురం మధురం’,‘యుద్ధం శరణం’ సినిమాలకు గేయ రచయిత్రిగా పనిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: