మురికివాడల్లో నివసించే పేదల బతుకులు, వారి కష్టాలే నేపథ్యంగా వచ్చిన రజనీకాంత్‌ 'కాలా' సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన కాలా చిత్రం ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం మలేషియాలో రికార్డు వసూళ్లను సొంతం చేసుకొన్నది. యూఎస్, ఆస్ట్రేలియాలో సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ చిత్రం తొలివారం ముగిసేటప్పటికీ 112.2 కోట్లు సాధించింది.
చెన్నై లో రికార్డులు
రిలీజ్‌కు పలు హక్కుల అమ్మకాల ద్వారా ఈ చిత్రం రూ.230 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్‌లో కాలా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.ప్రస్తుతం రజనీకాంత్‌ తన తదుపరి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డార్జిలింగ్‌లో జరుగుతోంది. మలేషియాలో రజనీకాంత్‌ చిత్రాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. హిట్టు, ఫ్లాప్ తేడా లేకుండా రికార్డు కలెక్షన్లు నమోదవుతుంటాయి.
మలేషియాలో రికార్డు కలెక్షన్లు
మిశ్రమ స్పందన వ్యక్తమైన కాలా చిత్రం కూడా మంచి వసూళ్లను సాధించింది. తొలివారంలో రూ.7.61 కోట్లు వసూలు చేయడం ఓ రికార్డుగా మారింది. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ... 'కాలా'కు లభిస్తున్న ఆదరణ భగవంతుడి అనుగ్రహం వల్లే వచ్చిందని, దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల్లోనూ ఈ సినిమా బాగా ఆడుతోందని అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం సహకరించడంతో అక్కడ కూడా 'కాలా' సినిమా బాగా ఆడుతోందని చెప్పారు.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: