నాచురల్ స్టార్ నాని కెరియర్ లో మంచి ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధం నిరాశపరచినా తన జోష్ మాత్రం తగ్గించలేదు నాని. ఓ పక్క బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్న నాని జర్సీ, నాగార్జునతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నాడు.


ఇక ఇదే కాకుండా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తో నాని సినిమా చేస్తున్నాడని టాక్. ఈ కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా ఎందుకో కుదరలేదు. ఇప్పుడు నాని మంచి ఫాంలో ఉన్నాడు. పూరి ఫ్లాపుల్లో ఉన్నా టేకింగ్ లో తిరుగు ఉండదు. అందుకే పూరి చెప్పిన లైన్ నానికి నచ్చడంతో ఓకే చెప్పేశాడట.


త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. సినిమా పూరి మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. పూరి స్టైల్ లో నాని అంటే కచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న నానికి పూరి బ్రేక్ ఇస్తాడని అనుకుంటున్నారు. అంతేకాదు నాని సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు పూరి. 


నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న టాక్ ఉంది. అందుకే నానితో పూరి సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాకు నిర్మాత ఎవరు. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి విషయాలు త్వరలో వెళ్లడవుతాయి. ఈ సినిమా తర్వాత పూరి తనయుడు ఆకాష్ తో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు.
  


మరింత సమాచారం తెలుసుకోండి: