రంగస్థలం తర్వాత రాం చరణ్ సినిమా రేంజ్ ఏంటో అందరికి అర్ధమైంది. కరెక్ట్ సినిమా పడితే చరణ్ స్టామినా కూడా ఆ సినిమాతో ప్రూవ్ అయ్యింది. సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం చిట్టిబాబుగా రికార్డులతో చెడుగుడు ఆడిన రాం చరణ్ ఈసారి బోయపాటి సినిమాతో మళ్లీ సంచలనం సృష్టించబోతున్నాడు.


యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ కు విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నాడు. కోలీవుడ్ హీరో ప్రశాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈమధ్యనే ఇంటర్వల్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా షూట్ చేశారని వార్తలు వచ్చాయి.


అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది. చరణ్ ఇదవరకు సినిమాల రేంజ్ లోనే ఈ సినిమాను వి సెల్యులాయిడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 70 నుండి 75 కోట్ల మధ్యలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. స్టార్ సినిమా అది ఓ సూపర్ హిట్ తర్వాత వస్తుంది అయినా సరే లెక్కకు మించి కాకుండా కరెక్ట్ బిజినెస్ చేస్తున్నారు. 


కచ్చితంగా రాం చరణ్ ఇప్పుడున్న ఫాంలో 75 కోట్లు జస్ట్ 3 రోజుల కలక్షన్స్ అని చెప్పొచ్చు. మొదటి వారం కరెక్ట్ గా నిలబడితే మళ్లీ రంగస్థలం రికార్డులను సైతం తిరగ రాసే అవకాశం ఉంటుంది. అసలే బోయపాటి సినిమా ఫ్యాన్స్ కోరుకునే అంశాలు అన్ని పుష్కలంగా ఉండేలా చూసే బోయపాటి రాం చరణ్ ను ఎలా చూపిస్తాడో అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: