తెలుగు, హిందీ ఇండస్ట్రీలో రాధికా ఆప్టే అంటే తెలియని వారు ఉండరు.  నోటికి ఏది వస్తే అది మాట్లాడటం..తర్వాత సర్ధుకు పోవడం ఈ అమ్మడికి వెన్నెతో పెట్టిన విద్య.  తెలుగు లో రక్త చరిత్రతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ సరసన రెండు సార్లు నటించింది.  ఆ మద్య టాలీవుడ్ లో ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ బాగా ఉంటుందని..హీరోయిన్లు కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారని..వారికి నటించే అవకాశం ఇవ్వరని ఘాటుగా వ్యాఖ్యానించింది. 
Related image
‘కబాలి’ లో రజినీకాంత్ సరసన నటించిన రాధికా ఆప్టే ఆ మద్య ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచారని ఆరోపించి సంచలనం రేపింది రాధిక. తన అందచందాలను బహిర్గతం చేస్తూ గ్లామర్ ఫోటోలతో తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే రాధిక తన పోస్టుల ద్వారా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. అలాగే హిందీ సినిమాల్లో హద్దు మీరిన ఎక్స్‌పోజింగ్‌తో విమర్శించే వారికి పని కల్పిస్తోంది.

అంతే కాదు సహజీవనం పై కూడా ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసింది.  అవును ఇద్దరు ఇష్టమై కొంత కాలం కలిసి ఉంటే తప్పేముంది..నా వరకు ఇది రైట్ అని తీవ్ర విమర్శల పాలైంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ..సినిమాల్లో రాణించాలంటే బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరి. నాకు అలాంటి నేపథ్యం లేకపోవడం వల్లే ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
Image result for radhika apte hottest
ఒకప్పుడు అందాల ప్రదర్శనకు నేను వ్యతిరేకిని. కానీ, డబ్బు కోసం కొన్ని చెత్త సినిమాల్లో కూడా నటించాల్సి వచ్చింది.  ఇప్పుడు నాకు డబ్బుకు, హోదాకు కొదవలేదు..అందుకే నేను ఇక నుంచి ఎలాంటి చెత్త సినిమాల్లో నటించని చెబుతుంది రాధికా ఆప్టె.


మరింత సమాచారం తెలుసుకోండి: