అదేంటి ఆల్రెడీ శివ శంకర వరప్రసాద్ గారి అల్లుడుగా కళ్యాణ్ దేవ్ అందరికి తెలిసిన వాడే. చిరంజీవి అసలు పేరు వరప్రసాద్ ఇప్పుడు ఈ టైటిల్ తోనే కళ్యాణ్ తన రెండో సినిమా చేస్తున్నాడు. మొదటి సినిమా విజేతగా రాబోతున్న కళ్యాణ్ దేవ్ రెండో సినిమాగా వరప్రసాద్ గారి అల్లుడు అంటూ వస్తున్నాడు.


విజేత అనగానే చిరు సూపర్ హిట్ మూవీ గుర్తొస్తుంది. మొదటి సినిమాతో మెగాస్టార్ టైటిల్ వాడేసిన కళ్యాణ్ దేవ్ రెండో సినిమాకు చిరు అసలు పేరుని టైటిల్ గా వాడేస్తున్నాడు. ఈ మెగా వాడకం చూస్తుంటే అందరి హీరోల్లో మెగా జపం చేసేలా ఉన్నాడు కళ్యాణ్ దేవ్. 


టాలీవుడ్ లో మెగా హీరోల లిస్ట్ అందరికి తెలుసు పవన్ నుండి రాబోతున్న కళ్యాణ్ దేవ్ వరకు మైకు అందుకున్న మెగా మోత మోగాల్సిందే. దానికి తగినట్టుగానే మెగా ఫ్యామిలీ నుండి ఎవరు వచ్చినా ఆదరిస్తున్నారు మెగా అభిమానులు. కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత రాకేష్ శషి డైరక్షన్ లో వస్తుంది.


సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. మురళి శర్మ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ మూవీగా తెరకెక్కుతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ మెగా అల్లుడు విజేతగా సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: