నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా స్టార్ మా టి.ఆరి.పి రేటింగులలో దూసుకెళ్లింది. ఇప్పుడు అదేవిధంగా బిగ్ బాస్ సెకండ్ సీజన్ కూడా భారీ టి.ఆర్.పి రేటింగుని సాధించింది.


ఇక ఈ బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఉన్న కంటెస్టంట్ అంత సెలబ్రిటీస్ కాకున్నా సరే వారి మీద బుల్లితెర ఆడియెన్స్ ప్రేమను పెంచుకున్నారు. అంతేకాదు ఈ సీజన్ లో ముగ్గురు కామన్ మెన్ కు అవకాశం ఇచ్చారు. అయితే మొదటి వారమే సంజనా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 


బిగ్ బాస్ 2 నుండి తనకు కాల్ వచ్చిందని చెప్పింది ఫేడవుట్ హీరోయిన్ మాధవిలత. మొదట ఆమెకు కాల్ వచ్చిందని అప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారని కాని సెకండ్ టైం వచ్చినప్పుడు తేడా కొట్టిందని అన్నది మాధవిలత. బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ వార్తలు రావడం ప్రస్తుతం హాట్ న్యూస్ అయ్యింది. 


ఎంత వైరల్ అయితే అంత మంచిదని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈ ఆరోపణలను లైట్ తీసుకుంటున్నారు. ఈమధ్యనే నాని మీద కూడా మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసింది. నానితో స్నేహితుడా సినిమా చేసిన మాధవిలత ప్రస్తుతం కెరియర్ లో అవకాశాలు లేక ఖాళీగా ఉంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: