మెగా ఫ్యామిలీ నుండి హీరోలు ఎక్కువయ్యే సరికి వారి సినిమాలు వారికే పోటీ అవుతున్నాయి. ఈ ఇయర్ ఆల్రెడీ సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ తొలిప్రేమ ఒకరోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. ఇలా ఒకేసారి ఇద్దరు మెగా హీరోలు సినిమాలు రిలీజ్ చేయడం వల్ల మెగా ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది.


అందుకే ఇకనుండి అలా ఒకే టైంలో ఏ ఇద్దరి మెగా హీరోల సినిమాలు రిలీజ్ ప్లాన్ చేయొద్దని మెగాస్టార్ చిరంజీవి ఆదేశించారు. అయితే జూలై 6న మళ్లీ ఈ మెగా ఫైట్ షురూ అయ్యింది. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత ఆరోజు రిలీజ్ ఎనౌన్స్ చేయగా అంతకుముందే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటించిన తేజ్ ఐలవ్యూ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.


మెగా హీరోల క్లాష్ పై మళ్లీ సీరియస్ అయిన చిరంజీవి సొంత అల్లుడి సినిమా కన్నా ముందు మేనళ్లుడు సినిమాకు లైన్ క్లియర్ చేశాడు. జూలై 6న తేజ్ ఐలవ్యూ యధావిదిగా రిలీజ్ అవుతుంది. విజేత మాత్ర జూలై 12కి వాయిదా వేశారు. దీనికి కారణం మేనళ్లుడి మీద ప్రేమ మాత్రమే కాదు తేజ్ సినిమా నిర్మాత్ కె.ఎస్ రవికుమార్ తో ఉన్న అనుబంధం కూడా అని తెలుస్తుంది.


ఏది ఏమైనా సొంత అల్లుడు అది కూడా మొదటి సినిమాకు చిరు ఇలా చేయడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తుంది. కళ్యాణ్ దేవ్ విజేత సినిమా రాకేష్ శషి డైర్క్షన్ లో వస్తుండగా సాయి కొర్రపాటి సినిమా నిర్మించారు. నిన్న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ జరిగిన ఈ ఆడియోకి చిరుతో పాటు రాజమౌళి కూడా పాల్గొన్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: