అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చి దశాబ్ధ కాలం పైగా అవుతున్నా హీరోగా వేళ్ల మీద లెక్క బెట్టే హిట్ సినిమాలను తీసిన సుమంత్ మళ్లీరావా సినిమా హిట్ కొట్టడంతో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భరత్ తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన మళ్లీరావా మూవీ సుమంత్ కెరియర్ కు బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.


ఆ సినిమా తర్వాత ఏమాత్రం లేటు చేయకుండా మరో సినిమా చేస్తున్నాడు సుమంత్. ఇదం జగత్ అంటూ ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. అనీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు.


ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. బ్యాక్ డ్రాప్ మర్డర్ మిస్టరీ.. టార్చ్ వేసుకుని సుమంత్ వెతకడం ఫస్ట్ లుక్ అదిరిపోయే క్రేజ్ తెచ్చింది. అంతేకాదు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సుమంత్ ఇదం జగత్ లో ఫస్ట్ లుక్ లోనే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. 


సబ్జెక్ట్ ఏంటి అన్నది తెలియదు కాని ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. మళ్లీ రావా దర్శకు భరత్ నానితో జెర్సీ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా మొదలైన ఈ సినిమాతో అతనేంటో ప్రూవ్ చేస్తాడని తెలుస్తుంది. మరి సుమంత్ ఇదం జగత్ ఈ సారి హిట్ మేనియా కొనాగిస్తాడో లేదో సినిమా వస్తేనే కాని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: