కళ్యాణ్ రామ్ చవిచూసినన్ని ఫ్లాప్స్ సినీ ఇండస్ట్రీ లో మరెవరూ కూడా చూడలేదని చెప్పాలి. అయినా కళ్యాణ్ రామ్ తగ్గకుండా వరుస బెట్టి సినిమాలను తీస్తున్నాడు. అయినా కళ్యాణ్ రామ్ కు నిరాశే మిగులుతుంది. అయితే ఈ మధ్య వచ్చిన  నా నువ్వే సినిమా భారీ పరాజయాన్ని మూట గట్టుకున్న సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నిర్మాతలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ నష్టాల నుంచి బయట పడాలంటే ఎన్టీఆర్ మరో సారి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. 

Image result for kalyan ram naa nuvve

తాజాగా `నా నువ్వే` ట్రెడ్ లెక్క‌లు  బ‌య‌టకు వ‌చ్చాయి.  సినిమా మొత్తం 7 కోట్ల బ‌డ్జెట్ అయింది. కానీ సినిమా  బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ మొత్తాన్నే రాబట్టుకుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. వీరి లెక్కల ప్రకారం ‘నా నువ్వే’కు వచ్చిన మొత్తం వసూళ్లు కోటిన్నర రూపాయలు మాత్రమే. అన్ని ఏరియాల్లో ఈ సినిమా క‌లెక్ష‌న్స్ కేవ‌లం ల‌క్ష‌లు, వేలల్లోనే ఉండ‌టంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో నే బిగ్గెస్ డిజాస్ట‌ర్ అని ఈ రిపోర్ట్ తో అర్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ సినిమాకు ఇంత త‌క్కువ వ‌సూళ్లు రాలేదు.

Image result for kalyan ram naa nuvve

క‌ళ్యాణ్ రామ్  గ‌త సినిమా ఎమ్మెల్యే ప్లాప్ అయింది. కానీ న‌ష్టాలు లేకుండా నిర్మాత‌లు బ‌య‌ట ప‌డ్డారు.  కానీ నా నువ్వే విష‌యంలో మొత్తం రివ‌ర్స్ కొట్టేసింది. అందుకే సినిమా ప్లాప్ అయినా విజ‌యోత్స‌వం జ‌రిపే ఈ రోజుల్లో ఈ సినిమా విష‌యంలో  ఎలాంటి స‌క్సెస్ మీట్…థాంక్స్ మీట్ పెట్ట‌లేదు. సినిమా సూప‌ర్ హిట్ ఖాయ‌మంటూ చెప్పుకుని తిర‌గే పీఆర్ కు ఇప్పుడు ముఖం ఎక్క‌డ పెట్టుకోవాలో కూడా తెలియ‌డం లేద‌ని అంటున్నారు. ఇక ఎలాగూ వెనుక ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి అతని సినిమా ను తరువాత డిస్టిబ్యూటర్స్ కు అమ్మేవిధంగా అగ్రిమెంట్ కుదిర్చికుంటారేమో...!


మరింత సమాచారం తెలుసుకోండి: