హిందిలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ను తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో తీసుకొచ్చారు. రియాలిటీ షోలో సరికొత్త హంగులతో వచ్చిన బిగ్ బాస్ మొదటి సీజన్ తెలుగులో ఎన్.టి.ఆర్, తమిళంలో కమల్ హాసన్ అదరగొట్టారు. తెలుగులో ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో హోస్టింగ్ చేయడం షోకి బాగా ప్లస్ అయ్యింది.


ఇక ఈ సెకండ్ సీజన్ లో తెలుగులో నానిని హోస్ట్ గా తీసుకోగా తమిళంలో మాత్రం కమల్ హాసన్ మళ్లీ హోస్ట్ గా చేస్తున్నాడు. అక్కడ షో 14 వారాల పాటు నడుస్తుందట. అయితే ఇదవరకు కమల్ హాసన్ ఒక హీరో మాత్రమే కాని ఇప్పుడు రాజకీయనేత కూడా ఈమధ్య బిగ్ బాస్-2 తమిళంలో మసాలా కొంచం పెంచారు.


హౌజ్ మెట్స్ లిప్ టూ లిప్ కిస్సులు, డైపర్ల వాడకం లాంటివి చేస్తున్నారు. టాస్క్ లో భాగంగా ఇదంతా చేస్తున్నా ఆడియెన్స్ కు మాత్రం ఇది తప్పుడు సందేశం ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే కమల్ హాసన్ ప్రోగ్రాం లో కొన్ని మార్పులని సూచించారట. అవి ఒప్పుకుంటే ఓకే లేదంటే అగ్రిమెంట్ బ్రేక్ చేసి హోస్ట్ గా కూడా గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారట.


సీజన్ 1 తన సీరియస్ హోస్టింగ్ తో సూపర్ పాపులర్ చేసిన కమల్ హాసన్ ఇప్పుడు సెకండ్ సీజన్ లో ఇలా షాక్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరి బిగ్ బాస్-2 కొత్త హోస్ట్ ఎవరు.. ఏ స్టార్ హీరోని వాళ్లు ఒప్పించారు అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: