తెలుగు తెరపై ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్.  మొదటి సినిమాతోనే మెగా హీరో అంటే ఏంటో చూపించిన సాయిధరమ్ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో తన తడాఖా ఏంటో చూపించాడు.  ఆ తర్వాత మనోడికి బ్యాడ్ టైమ్ మొదలైంది.  వరుస అపజయాలతో సతమతమవుతున్న సాయిధరమ్ తాజాగా కరుణాకరణ్ దర్శకత్వంలో ‘తేజ్ ఐ లవ్ యు’సినిమాలో నటిస్తున్నాడు. 


సాయి ధరమ్ తేజ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.అయితే ఆ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కరుణాకరన్ చాలా రోజుల తరువాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ప్రస్తుతం అంచనాలు ఓ మాదిరిగా ఉన్నాయి.  కరుణాకర్ గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది, హీరో కి అయిదుగురు ఫ్రెండ్స్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కామెడీ అండ్ ఎమోషనల్ గా సాగడం కరుణాకర్ చాలా సినిమాల్లో చూపించాడు. 

Tej I Love You Trailer

హ్యాపీ - డార్లింగ్ కథలను ఇందులో మిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.  లవ్ ట్రాక్ - కామెడీ - ఎమోషన్ ఈక్వల్ బ్యాలెన్స్ చేసిన తేజ్ ఐ లవ్ యు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అనుపమ అయితే చాలా అందంగా కనిపిస్తోంది. సాయి అల్లరి సినిమాలో వర్కౌట్ అయితే క్లిక్ అవుతాడు.ఇక గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను కేఎస్. రామారావు నిర్మించారు.  ఏఒక్క సినిమాను జులై 6న రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు.  

Image result for tej tej i love posters

ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక వర్గం : సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: