భారతీయ టెలివిజన్ రంగంలో ఇప్పుడు బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తుంది.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది.  తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ వ్యాఖ్యతగా మళియాళంలో కూడా మొదలైంది.  తెలుగు లో మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే..ప్రస్తుతం ఆయన ప్లేస్ లో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ లు వ్యాఖ్యతలుగా ఉన్నారు.  అయితే తెలుగు లో కన్నా తమిళంలో ముందుగానే ప్రారంభం అయ్యింది బిగ్ బాస్.  గతంలో తమిళ బిగ్ బాస్ లో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు కూడా బిగ్ బాస్ లో ప్రతిరోజూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూ వస్తుంది.  తన గంభీరమైన హోస్టింగ్ ద్వారా ఫస్ట్ సీజన్లో మంచి మార్కులు కొట్టేసిన కమల్.. సెకండ్ సీజన్‌కొచ్చేసరికి.. కొత్త సమస్యల్ని నెత్తికెత్తుకోవాల్సి వస్తోంది.
Image result for tamil big boss 2
సొంతగా రాజకీయ పార్టీ స్థాపించి.. ప్రజాజీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన నేత. ఆ మేరకు హుందాతనాన్ని ప్రదర్శించాల్సిన అత్యవసర పరిస్థితి.  స్టార్ విజయ్‌లో టెలికాస్ట్ అవుతున్న తమిళ్ ‘బిగ్‌బాస్’.. రేటింగ్స్ కోసం వెంపర్లాడుతూ.. కంటెంట్‌ నీచపు స్థాయిని తాకుతోంది. మొదటి వారం నుంచి తమిళ బిగ్ బాస్ పై విమర్శలు రావడం మొదలయ్యాయి. 
Image result for tamil big boss 2
ఇద్దరు ఆడాళ్ళు లిప్‌టు‌లిప్ కిస్సులతో చెలరేగిపోయి.. షోను ‘రక్తి’ కట్టించడం.. ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతి పరిచింది. ఇంటిల్లిపాదీ కూర్చుని చూసే టెలివిజన్ షో అన్న కనీస ఇంగితాన్ని మరిచి పార్టిసిపేంట్స్ అందరూ హద్దులు దాటెయ్యడంతో.. రేటింగ్స్ మీద కొత్త అంచనాలు మొదలయ్యాయి.  దాంతో  ప్రతి శని, ఆదివారాల్లో బుల్లితెర తాను గౌరవంగా ఉండగలనా..ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచనలో కమల్ హాసన్ ఉన్నారని టాక్ వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: