మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి..వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’తో ఘన విజయం సాధించారు. 
 40 కోట్లుతో యుద్ధం
 ప్రస్తుతం చిరంజీవి ఉన్న హోదాకు మాస్ మసాలా సినిమాలు కాకుండా మెస్సేజ్ తరహా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  అందుకే తన తదుపరి సినిమా ప్రధమ  స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అబ్బురపరిచే విధంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

షాక్ లో చిత్ర యూనిట్

సైరా చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. 60 ఏళ్ల వయసులో కూడా చిరు ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ సినిమాలో ఓ చిరంజీవి గురువుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నారు.  ఈ సినిమా వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి సంసిద్దంగా ఉన్నారు. అందుకే వీలైనంత వరకు ఇతర భాషా నటులను తీసుకుంటున్నారు. 
ఇంగ్లాండ్ నుంచి
 ప్రస్తుతం హైదరాబాద్ శివారులో సైరా షూటింగ్ జరుగుతోంది. యుద్ధ సన్నివేశాలని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరు చాలా ఎనర్జిటిక్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు.  కేవలం ఒక్క వార్ సీన్ కోసం 40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సైరా ఏస్థాయిలో నిర్మించబడుతోందో అని. బ్రిటీష్ వారితో సైరా యుద్ధం చేసే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ వార్ ఎపిసోడ్స్ కోసం 40 మంది విదేశాయులని ఇంగ్లాండ్ నుంచి రప్పించినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: