ఈ మద్య వస్తున్న సినిమాలకన్నా టైటిల్స్ విషయాల్లోనే మొదటి నుంచి క్యూరియాసిటీ పెరుగుతుంది.  ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో కొంత మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని..కొన్న సీన్లు అసభ్యంగా ఉన్నాయని రక రకాల కారణాల వల్ల కేసులు నమోదు అవుతున్నాయి.  బాలీవుడ్ లో ఆ మద్య వచ్చిన పద్మావత్ సినిమా ఎంత గందరగోళం మద్య రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  మొత్తానికి సినిమా రిలీజ్ కావడం ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమా లేక పోవడం మంచి విజయం సాధించింది. 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో ఓ పాట బ్రాహ్మాణులను ఆచారాలను కించపరిచే విధంగా ఉన్నాయని పెద్ద గొల జరిగింది. మొత్తానికి ఆ పాటలో కొన్ని పదాలు మార్చడంతో వివాదం ముగిసింది. తాజాగా  ‘బ్రాహ్మణుల అమ్మాయి.. నవాబుల అబ్బాయి” ప్రస్తుతం ఎక్కడ చుసిన ఈ షార్ట్ ఫిల్మ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.   ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కాకముందే వివాదాలు చుట్టుముడుతున్నా యి.ఈ షార్ట్ ఫిల్మ్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ఇది బ్రాహ్మణుల మనోభావాలను కించపరచేలా ఉందని కొందరు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ  లఘుచిత్రం బ్రాహ్మణులను అవమానించేలా, లవ్ జీహాద్‌ను ప్రేరేపించే విధంగా ఉందని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి.  చంచల్ శర్మ సమర్పించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఫారూక్ రాయ్ దర్శకత్వం వహించారు. దీని ట్రైలర్‌ను యూట్యూబ్ లో విడుదల చేశారు.  మరోవైపు తమ సినిమా మనుషులకంటే మతం గొప్పదేమీ కాదని సందేశం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

 మానవత్వానికి సంబంధించిన సినిమా అని టీమ్ చెబుతోంది. డిజిటిల్‌ మీడియంకు సెన్సార్‌ నిబంధనలు వర్తించని నేపథ్యంలో కొందరు స్వేచ్ఛగా సినిమాలు తీస్తున్నాయి.  సమాజంలో ఉద్రిక్తతలకు దారితీయడంతో పాటు భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున యూట్యూబ్‌లో ఉన్న సినిమా ట్రైలర్‌ను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: