ఇప్పడు సినిమాల ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటీమణులు తెగ ఆరోపణలు చేస్తున్నారు.  హీలీవుడ్ లో పెద్ద ఉద్యమమే కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పడు భారతీయ సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ పై పెను దుమారం చెలరేగుతుంది.  ఇక టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని సినీ నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేసింది.  అయితే కాస్టింగ్ కౌచ్ కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదని వివిధ రంగాల్లో కూడా జరుగుతుందని పలువురు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. 
Image result for casting couch
తాజాగా సినీ నటి ఆమని క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి ఆమని స్పందించారు.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది తనకి తెలిసి లేదని తెలిపారు. అయితే, కొన్ని కొత్త కంపెనీల్లో మాత్రం కొందరికి అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు.  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకొత్తగా వచ్చిన వారి విషయంలో ప్రొడక్షన్ నుంచి నిర్మాతల వరకు కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాను విన్నానని.. కొత్తవారికి చూసి బాగున్నావని చెప్పి, ఓక సినిమాలో తీసుకుంటామని అనే వారని, తదుపరి రోజు ఫోన్‌ చేసి గెస్ట్‌హౌస్‌కు రండని, ఒకసారి మేకప్‌ టెస్ట్‌ చేస్తామని అనేవారని చెప్పారు.
Image result for casting couch
ఇక గెస్ట్‌హౌస్‌ అనగానే ఆ విషయం అర్థమయిపోయేదని, ఇలాంటివన్నీ కొత్త కంపెనీలో ఉంటాయని ఆమని అన్నారు. కొంత మంది ఇండస్ట్రీలో సినిమాలు తీస్తారో..తీయరో తెలియదు కానీ..కంపెనీలు మాత్రం చాలా ఉన్నాయి.  అయితే అలాంటి వాటితో కొత్తగా వచ్చే అమ్మాయిలకు చాలా ఇబ్బందులు ఉంటాయని..నమ్మించి మోసం చేసే వారు చాలా మంది ఉన్నారని అన్నారు.  అందుకే ఇండస్ట్రీకి వచ్చే వారు సీనీ ఆచీ తూచీ వ్యవహరించాలని అన్నారు. గెస్ట్‌హౌస్‌ అనగానే ఆ విషయం అర్థమయిపోయేదని, ఇలాంటివన్నీ కొత్త కంపెనీలో ఉంటాయని ఆమని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: