యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ గ్రాఫ్ ఈ మూడు నాలుగేళ్లలో మళ్లీ టాప్ రేంజ్ కు వెళ్లిందని చెప్పొచ్చు. టెంపర్ నుండి తారక్ కెరియర్ లో కొత్త ఉత్సాహం కనబడుతుంది. వరుస సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్, త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.


ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంది. సిల్వర్ స్క్రీన్ పై ఎన్.టి.ఆర్ కు పోటీ అంటే అది ఎంత రసవత్తరంగా ఉంటుందో తెలిసిందే. స్టార్ సినిమా అంటే దానికి పోటీగా మరో స్టార్ సినిమా వస్తుంది. అలానే తారక్ అరవింద సమేత సినిమా దసరాకి రిలీజ్ అనుకున్నారు. 


ఇప్పుడు ఆ దసరా రేసులో ఎన్.టి.ఆర్ తో పాటు నాని కూడా వస్తున్నాడని తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున కలిసి చేస్తున్న సినిమా కూడా దసరాకి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ దేవదాసు అని ప్రచారంలో ఉంది.   


అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ అరవింద సమేత మళ్లీ తన మార్క్ ఎంటర్టైనర్ గా హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది. అయితే సోలోగా వస్తే ఎలా ఉండేదో కాని నాగార్జున, నానిల మల్టీస్టారర్ ఈ సినిమాకు పోటీ అవుతుంది. మరి ఈ దసరాకి నాని, తారక్ లలో ఎవరు హిట్ కొడతారో చూడాలి. ఎన్.టి.ఆర్ తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా నాని అక్కడ తారక్ ను రిప్లేస్ చేశాడు.    



మరింత సమాచారం తెలుసుకోండి: