బిగ్ బాస్ సీజన్ 1 లో సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ రాజకీయ నేపథ్యంలో కొన్ని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  అంతే అప్పటి నుంచి నాలుగు నెలల వరకు ప్రతిరోజూ కత్తి మహేష్ పై ఎదో ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి..బోర్ కొట్టే పరిస్థితికి వచ్చింది.   ఒకానోక సందర్భంలో కత్తిపై కోడిగుడ్ల దాడి చేయడంతో కథ మరో మలుపు తిరిగింది.  కత్తి మహేష్ తో జనసేన కార్యకర్తలు సెల్పీ దిగడంతో  వివాదం సర్థుమణిగిందని అనుకున్నారు. 
Image result for sri rama
కానీ కత్తి మహేష్ మాత్రం సమయం చిక్కినప్పుడల్లా పవన్ ని కడిగిపడేస్తూనే ఉన్నాడు.  తాజాగా కత్తి మహేష్ మరో వివాదంలో చిక్కున్నాడు.  హిందువులు పరమ భక్తితో కొలిచే శ్రీరాముడు క్యారెక్టర్ లేని వ్యక్తిగా మాట్లాడినట్లు ఆయనపై అభియోగం మోపారు.  తాజాగా శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జబర్ధస్త్‌ ఫేం, మెగా బ్రదర్‌ నాగబాబు డిమాండ్‌ చేశారు. ఏ మతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడిన తప్పేనని ఆయన అన్నారు.
Image result for kati mahesh
రామాయణం ఒక పుస్తకం కాదని, కోట్లాది మంది హిందువులు ఆరాధించే చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఇక భారత దేశంలో నాస్తికత్వం పేరుతో హిందువుల జోలికి వస్తే శిక్ష అనుభవిస్తారని, మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరూ ఊరుకోరని ఆయన అన్నారు.  హిందూ మతం, దేవతలపై పథకం ప్రకారం దాడి జరుతోందని ఆరోపించారు. మతపరమైన చర్చలను ఎవరూ ప్రోత్సహించొద్దంటూ సూచించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మషేష్‌పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే చారిత్రాత్మక తప్పు చేసిన వారవుతారని అన్నారు. పోలీసులు తేలిగ్గా తీసుకుంటే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని నాగబాబు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: