హిందువుల ఆరాధ్య దైవం రాముడి మీద రామాయణం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు కత్తి మేహేష్. అయితే కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికే చాలా ఆగ్రహం తో ఉన్నారు. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కత్తి మెహెష్ మీద విరుచుకుపడ్డాడు. తీవ్రపదజాలం తో మాట్లాడినాడు. రెండు ప్రభుత్వాలు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇంతక ముందు కూడా చాలా మంది హిందూ మతం మీద చాలా విమర్శలు చేసినారు. వారి మీద ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. ఇలాంటి విషయాలలో కఠినంగా శిక్షించాలని చట్టం లో నిర్దిష్టంగా పొందు పొరచలేదు. మరీ కత్తి మహేష్ మీద చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవచ్చు. 

Image result for nagababu

నాగబాబు ఇంకా ఏమన్నాడంటే, నా మతం మీద, నా దేవుళ్ల మీద కామెంట్ చేసిన నీచుడ్ని కచ్చితంగా శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. కానీ ఆ వ్యక్తికి భయంకరమైన శిక్ష పడి తీరాలి. చంద్రబాబు, కేసీఆర్ ఈ విషయంపై రియాక్ట్ అవ్వాలి. లేదంటే చారిత్రక తప్పిదం చేసినవాళ్లు అవుతారు. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్లవుతారు." క్రిస్టియన్లకు బైబిల్, ముస్లిమ్స్ కు ఖురాన్ ఎలాంటిదో హిందువులకు రామాయణం, భారతం, భగవద్గీత లాంటి గ్రంధాలు అలాంటివన్నారు నాగబాబు.

Image result for kathi mahesh

అందులోని వ్యక్తులపై కామెంట్ చేస్తే, ఎలాంటి వ్యక్తులైనా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. "శ్రీరామచంద్రుడు మాకు దేవుడు, సీతమ్మ దేవత. హనుమంతుడు మాకు ఆరాధ్యం. మా దేవతల్ని అవమానిస్తారా. ఇంత ధైర్యం ఎవరిచ్చారు మీకు. వ్యక్తులను తిడితే మేం రియాక్ట్ అవ్వం. మీ ఖర్మకు పోతారని వదిలేస్తాం. మా దేవతల్ని, మా సంస్కృతి, మా విశ్వాసాల్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. అలా చేస్తే తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది." అని మాట్లాడినాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: