మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. అప్పుడే అతని చురుకుదనం అందరికి నచ్చింది. ఇక సినిమాల్లో పవర్ స్టార్ గా అశేష అభిమాన జనాలను ఏర్పరచుకున్న పవన్ జనసేన అంటూ పార్టీ పెట్టాడు. 


చిరు పార్టీ క్లోజ్ చేయగా పవన్ పార్టీ కొత్త చైతన్యాన్ని తెచ్చేలా చేసింది. ఇక యువతలో పవన్ కు ఉన్న ఫాలోయింగ్ ఎక్కడ పార్టీ మీటింగ్ పెట్టినా ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు ఆకర్షితులవుతున్నారు. ఇక ఇన్నాళ్లు చిరు, పవన్ ల మధ్య దూరం కూడా ఇప్పుడు తగ్గిపోయింది.


మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నాడు. కచ్చితంగా మెగా అస్త్రం వచ్చే ఎన్నికల్లో బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. జనసేనకు కొన్ని సీటైనా వచ్చేలా మెగా కాంపౌండ్ అంతా కృషి చేస్తుంది. ప్రత్యక్షంగా ఈమధ్య మెగా ఫ్యామిలీ అంతా జనసేనకు సపోర్ట్ గా నిలవడం విశేషం.


పవన్ ఆల్రెడీ పోరాట యాత్ర అంటూ ప్రజల్లో తిరుగుతున్నాడు. ఏపిలో 2019 ఎన్నికలు హాట్ హాట్ గా ఉండబోతాయన్నది అందరికి తెలిసిన విషయమే. టిడిపి, వైసిపిలతో పాటుగా జనసేన ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఇక తెలంగాణాలో కూడా జనసేన యాత్ర ఉంటుందని అంటున్నారు. మరి ఇక్కడ ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: