పవన్ కళ్యాణ్ గురించి విడాకుల గురించి రేణు దేశాయ్ మొత్తం మీద నోరు విప్పింది. అయితే విడాకులు తీసుకోవడానికి గల కారణాలు వివరించింది. కారణాలు కాదు ఒకటే కారణం అది   పవన్ కళ్యాణ్ వేరే వ్యక్తి తో అక్రమ సంభందం వల్లే నేను విడాకులు అడిగాను అని కుండ బద్దలు కొట్టింది. అయితే ఇప్పటి వరకు వీరి విడాకులు గురించి చాలా మందికి తెలియదు. ఇప్పడు నిజం బయటికి వచ్చే సరికే పవన్ కళ్యాణ్ దోషిగా తేలాడు. పెళ్లి చేసుకున్న భార్యను మరచి  వేరే వ్యక్తి తో సంభందం పెట్టుకోవడం ముమ్మాటికి తప్పే. 

Image result for renu desai

11 ఏళ్ళు కాపురం చేసిన భర్త, భార్యకు తెలియకుండా వేరొకరితో సంబంధం పెట్టుకొని ఆమెకు బిడ్డను కంటే భార్య పరిస్థితి ఏమిటి...? అదే తన పరిస్థితి అని కుండబద్దలు కొట్టింది. ఆ స్థితిలో ఏ భార్య అయినా ఏం చేస్తుంది, ఒకవేళ మీరే అదే స్థితిలో ఉంటే మీకు నా బాధ తెలుస్తుందని అంది రేణు. పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ విడాకుల తర్వాత ఎవరూ పవన్ ని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. కనీసం రేణు దేశాయ్ కి మద్దతుగా కూడా ఎవరూ మాట్లాడలేదు, ఎందుకంటే విడాకులకు గల కారణం బైటకు రాలేదు.

Image result for renu desai

అయితే ఇటీవల రేణు తనకి కూడా తోడు కావాలని కోరుకుంది. బిడ్డల అంగీకారం తోటే ఆమె వివాహానికి సిద్ధమైంది, నిశ్చితార్ధం జరిగింది. రేణుతో విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకున్నా సైలెంట్ గా ఉన్న వారంతా.. రేణు పెళ్లి చేసుకోబోతోందని తెలిసే సరికి షాక్ అయ్యారు. రేణుదేశాయ్ ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండాలని అనుకున్నారేమో.. సోషల్ మీడియాలో ఆమె నిర్ణయాన్ని తప్పుబడుతూ పోస్టింగ్ లు మొదలుపెట్టారు. ఇటీవల ఈ టార్చర్ బాగా పెరిగే సరికి రేణు దేశాయ్ సోషల్ మీడియా నుంచి బైటకి వచ్చేసింది. ఇప్పుడిలా ఓ ఇంటర్వ్యూలో మాత్రం విడాకులకు కారణం పవన్ కల్యాణ్ అని ప్రకటించి సంచలనం సృష్టించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: