ఒక ఇమేజ్ వచ్చాక దర్శకుల మాట వినని హీరోలు ఉంటారని తెలిసిందే. అయితే దర్శకుల మాటలని కాదు కాని ఎంచుకున్న కథ ప్రేక్షకులు తమ నుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో వారే నిర్ణయించుకుంటారు. హిట్ అయితే ఓకే కాని ఫ్లాప్ అయితే మాత్రం ఆడేసుకుంటారు.


ఒకానొక దశలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలానే ఫ్లాపులు ఫేస్ చేశాడని అప్పట్లో టాక్. అది నిజమని చెప్పలేం కాని కొద్ది పాటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని తాము ఎలాంటి సినిమాలు తీసినా ఫ్యాన్స్ నచ్చేస్తారు అన్న భావన స్టార్స్ లో ఉంటుంది. అయితే అలా తీసినప్పుడు హీరోలకు భారీ షాకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 


ఈ కోవలో ఇప్పుడు సాయి ధరం తేజ్ కూడా వచ్చాడని అంటున్నారు. సుప్రీం తో స్టార్ ఇమేజ్ అందుకున్నాడనిపించిన ఈ మెగా మేనళ్లుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. లేటెస్ట్ గా వచ్చిన తేజ్ ఐలవ్యూ కూడా ఫ్లాప్ అయ్యింది. సినిమా కథల విషయంలో తేజూ చేస్తున్న పొరపాట్లే ఇలా తనకు వరుస అపజాయలను అందిస్తుంది.


పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు ఎలాంటి సినిమా తీసినా ఫ్లాపులొచ్చాయి. ఆ తర్వాత నితిన్ కూడా దాదాపు 14 సినిమాల దాకా ఫ్లాపులొచ్చాయి. ఇప్పుడు వారి దారిలోనే తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు 6 ఫ్లాపులు ఎదుర్కున్నాడు సాయి ధరం తేజ్. మరి తేజూని హిట్ ట్రాక్ ఎక్కించే సినిమా ఏ దర్శకుడు తీస్తాడో చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: