రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు మిగిల్చిన సంగతీ తెలిసిందే. ఇంతక ముందు వచ్చిన సినిమాలు రజినీకాంత కెరీర్ లోనే  భారీ నష్టాలును చవి చూశాయి. అయితే కాలా సినిమా కు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా నిర్మాత మాత్రం కాలా సినిమా డిజాస్టర్ అంటే ఒప్పుకోవడం లేదు. ఈ సినిమా నిర్మాత ఎవరో కాదు రజినీకాంత్ అల్లుడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యిందని చెబుతున్నాడు. 

Image result for kala movie

కాలా సినిమా సూపర్ హిట్ అని, కమర్షియల్‌గా కూడా ఫెయిల్ కాలేదని, తాము ఈ సినిమాతో నష్ట పోలేదని ధనుష్ స్పష్టం చేస్తున్నాడు. అయినా నిర్మాతకు ఎందుకు వస్తాయి నష్టాలు? డిస్ట్రిబ్యూటర్లకు కదా నష్టాలు వచ్చేది. రెండు వందల కోట్ల రూపాయల స్థాయికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముకున్నారు. తద్వారా రజనీకాంత్ కు రెమ్యూనరేషన్ బాగానే ముట్టి ఉంటుంది. ఇక నిర్మాత అయిన అల్లుడికి కూడా బాగానే డబ్బు వచ్చి ఉంటుంది. ఆ పై టీవీ రైట్స్ ను కూడా భారీ ధరకు అమ్ముకున్నారు. సో.. లాభాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. పదుల కోట్ల రూపాయల్లో ఉంటాయి.

Image result for kala movie

ఎటొచ్చీ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారి పరిస్థితే ఏమిటో తెలియడం లేదు. కొన్నేళ్లుగా ‘కబాలి’ని మినహాయిస్తే రజనీ కాంత్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు బాగా లాస్ అవుతూ వస్తున్నాయి. ‘కొచ్చాడయాన్’ నష్టాల వ్యవహారం ఇప్పటికీ రజనీకాంత్ కుటుంబాన్ని కోర్టుకు లాగుతోంది. ఆ తర్వాత లింగా డిస్ట్రిబ్యూటర్ల రచ్చ కూడా గట్టిగానే సాగింది. ‘కాలా’ పరిస్థితి లింగా కన్నా దారుణమని ట్రేడ్ వర్గాలు అంటున్నా, రజనీ కుటుంబం మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: