నాని హోస్ట్ గా వస్తున్న స్టా మా ప్రెస్టిజియస్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 అనుకున్నంత రేంజ్ లో కాకున్నా ఇప్పుడిప్పుడే షో మీద ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. కామన్ మెన్ గా వచ్చిన గనేష్ మొదటి, రెండు వారాలు వరుసగా నామినేట్ అయ్యి కాస్త ఇబ్బంది పడగా మూడవ వారం నుండి అతను కూడా సెలబ్రిటీ అయ్యాడు.


ఇక హౌజ్ లో మొదటి నుండి ఎవరికి పడని ఓ వ్యక్తి ఉన్నాడు. అతనే కౌశల్.. సీరియల్స్, సినిమాలు చేస్తూ హీరో కటౌట్ ఉన్న కౌశల్ ఇంటి సభ్యులు అందరితో ఏమాత్రం కలిసినట్టు కనిపించడం లేదు. తన పంథా తనకు ఉన్నట్టుగా ఉన్నా పర్ఫెక్ట్ గేం ప్లాన్ తో ఆడుతున్న ఏకైక వ్యక్తి కౌశల్ అని అందరు భావిస్తున్నారు. 


కిరీటి ఎలిమినేషన్ టైం లో కౌశల్ గ్రాఫ్ డౌన్ గా ఉంది. కాని ఇప్పుడు తేజశ్విని అతి.. సామ్రాట్ సైలెన్స్.. తనీష్ అతి కోపం.. ఇవన్ని ఆడియెన్స్ ను ఇరిటేట్ చేస్తున్నాయి. కౌశల్ మాత్రం డే 1 నుండి ఎలా ఉన్నాడో నెల రోజుల తర్వాత కూడా అదే విధంగా కనిపిస్తున్నాడు. ఇక మధ్యలో అమిత్ మంచి వాడిగా ఉంటూ ఈ వారం ఎలిమినేషన్ లో భాను శ్రీకి సపోర్ట్ చేయలేదు. అతను కూడా గేమ్ ఆడుతున్నట్టు ఈ టాస్క్ తో తేలిపోయింది. 


కౌశల్ మాత్రం మొదటి నుండి ఒకేరకమైన ప్రవర్తనతో కనిపిస్తున్నాడు. అంతేకాదు ప్రస్తుతం ఈ వీక్ కెప్టెన్ గా కౌశల్ ఇంటి సభ్యులు హౌజ్ రూల్స్ పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే కొందరు ఆడియెన్స్ మాత్రం బిగ్ బాస్ హౌజ్ లో రియల్ హీరో కౌశల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: