కలక్షన్స్ లో.. సినిమా కథలతో ఎంత పోటీ పడుతున్నా టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఎక్కడో చిన్న తేడా ఉంది అనేది ఒకప్పటి లెక్క. అక్కడ సినిమాలు స్పాన్ ఎక్కువగా ఉంటుంది. రీచబులిటీ ఎక్కువ ఉంటుంది అన్న ఒక్క రీజనే తప్ప దాదాపు తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి.


ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలైతే రచ్చ రంభోలానే అని చెప్పొచ్చు. 80ల్లో సినిమాలో హీరో హీరోయిన్ లిప్ లాక్ అంటే పువ్వులు, చెట్టు కొమ్మలు అడ్డు పెట్టి ముద్దుముచ్చలాటలు ఉండేవి. ఇక కాల మారుతున్నా కొద్ది రొమాన్స్ లో అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసింది. తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలకు ధీటుగా రొమాన్స్ లో పీక్స్ కు వెళ్తున్నారు. 


ఇక లిప్ లాక్ సీన్స్ అయితే ప్రేమ అనే ముసుగులో మిగతా పనులంతా కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు అలా లిప్ లాక్ సీన్స్ చూసి వామ్మో అనుకునే ఆడియెన్స్ కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఈ లిప్ లాక్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మంచికా చెడుకా అన్నది తెలియదు కాని ఈ సినిమాలు తప్పకుండా సమాజం మీద ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు.    


అదరచుంభణం అది సినిమాలో ఒకటి రెండు ఉంటే ఏదో మాములే అనుకోవచ్చు. కాని సినిమా మొత్తం హీరో హీరోయిన్ కనబడితే మూతులు నాకితే అదేమంటారో వారికే తెలియాలి. రొమాన్స్ లో రచ్చ చేస్తున్న ఈమధ్య వచ్చిన కొన్ని సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది పక్కన పెడితే నేటి యువతను వారి ఆలోచనను పక్కదోవ పట్టిస్తున్నాయని మాత్రం చెప్పొచ్చు.  




మరింత సమాచారం తెలుసుకోండి: