నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ వారం మొత్తం ఎలా నడుస్తున్నా వారాంతరంలో నాని హోస్టింగ్ కాస్త బాగుందని చెప్పొచ్చు. ఈ శని, ఆదివారాల్లో శని వారం మొత్తం ఇంటి సభ్యులకు క్లాస్ పీకిన నాని ఆది వారం మాత్రం ఐస్ గడ్డ మీద ఇంటి సభ్యులను నిలబెట్టి వారికి చిన్న టాస్క్ ఇచ్చాడు.


ఐస్ గడ్డ మీద నిలబడి వారు రెండు పాటలలో ఒక పాటను.. ఇంటి సభ్యులకు సైగలతో చెప్పి దాన్ని కనిపెట్టేలా చేయాలి.. రెండో పాట నానికి ఎక్స్ ప్లైన్ చేసి నాని గుర్తుపట్టేలా చేయాలి. ఆ పాటని గుర్తించే దాకా హౌజ్ మెట్స్ ఐస్ గడ్డ మీదే ఉంటారు. అలా ఆదివారం షో జాయ్ ఫుల్ గా సాగింది.


ఇక ఈ వారం భాను శ్రీని ఎలిమినేట్ చేశారు ఆడియెన్స్. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న భాను శ్రీ అమిత్ వల్ల నామినేట్ అవగా ఫైనల్ గా దీప్తి, గణేష్ ల కన్నా తక్కువ ఓట్లతో భాను బయటకు రావాల్సి వచ్చింది. ఇక నిన్న జరిగిన టాస్క్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్థావనతో హౌజ్ కేకలేయడం జరిగింది.


దీప్తి టాస్క్ లో భాగంగా ఐస్ మీద నిలబడి నానికి పవర్ స్టార్ తీన్ మార్ సాంగ్ ఓహో బస్త్రీ దొరసాని సాంగ్ ఎక్స్ ప్లైన్ చేసింది. దాన్ని ముందు గుర్తుపట్టని నాని పవర్ స్టార్ పాటా అనగానే గుర్తుపట్టాడు. ఇక టాస్క్ ముగియగానే హౌజ్ మెట్స్ అందరికి రాజా ది గ్రేట్ లోని గున్న గున్న మామిడి సాంగ్ తో స్టెప్పులు వేయించాడు నాని. 


మరింత సమాచారం తెలుసుకోండి: